భారీ వర్షాల నేపథ్యంలో అద్దంకి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అక్షర ఉదయమ్ – అద్దంకి :

     

    రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సూచించారు.

     

    భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, రహదారులపై వరద ప్రవాహం, చెరువులు, కాలువలు, వాగులు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

     

     

    • ప్రజలకు చింతలపూడి అశోక్ కుమార్ విజ్ఞప్తి

     

    అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో ప్రయాణాలు చేయవద్దని, ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్ల వద్దని, వరద నీటితో నిండిన రహదారులను దాటేందుకు ప్రయత్నించ వద్దని, విద్యుత్ స్తంభాలు, తెగి పడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల విషయంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని చింతలపూడి అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే యరపతినేని విజ్ఞప్తి

    అక్షర ఉదయమ్ - పల్నాడు జిల్లా :   ఏపీలో మురసు తుఫాన్ హెచ్చరికల...

    తితిదే పాలక మండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం

    అక్షర ఉదయమ్ - తిరుమల :  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి...