ఏపీపై మురసు ఎఫెక్ట్‌ – పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అక్షర ఉదయమ్ – విజయవాడ :

     

    ఏపీలో పలు జిల్లాలో మురసు తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచే వానతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు అర్నబ్‌ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోక ముందే మళ్లీ వర్షం రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పడు తుపాను పరిస్థితి అంచనావేస్తూ తగు సూచనలు చేస్తున్నారు.

     

    విజయనగరం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. గంట్యాడ మండలంలో జోరుగా వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డెంకాడ, వేపాడ, చీపురుపల్లి మండలాల్లోనూ చిరు జల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు తెలిపారు.

     

    పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజక వర్గాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. తుపాను పరిస్థితిపై సబ్ కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

     

    శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, జి.సిగడాం, సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌, తాగునీరు, వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట మండలాల్లో వాన కురుస్తోంది.

     

    కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. తెల్లవారు జాము నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లలో వర్షపు నీరు నిలిచి పోయింది. శాంతినగర్, సాంబమూర్తి నగర్, పెద్ద మార్కెట్, గుడారిగుంట, సురేష్ నగర్, శశికాంత్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు నీట మునిగాయి. ప్రత్తిపాడు, కత్తిపాడులో, పిఠాపురంలో వర్షం పడింది.

     

    తునిలో భారీ వర్షం కురిసింది. తెల్లవారు జాము నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైతు బజారులో వాన నీరు నిలబడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జోరువానలో తడుస్తూనే అరటి వ్యాపారులు వ్యాపారాలు కొనసాగించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం, అంబాజీపేట ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి.

     

    రాజమహేంద్రవరం సహా తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, ఉండ్రాజవరం, పెరవలి, రాజానగరంలో గోపాలపురం మండలాల్లో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లలో వాన నీరు చేరింది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వర్షం దంచికొడుతోంది. గత వారంలో అర్నబ్‌ తుపాను ధాటికి యానాం అల్లకల్లోలంగా మారింది. దాని నుంచి తేరుకోక ముందే మళ్లీ వాన కురుస్తోంది.

     

    నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మురసు తుపాను హెచ్చరికతో విద్యా సంస్థలకు నేడు కలెక్టర్ సెలవు ప్రకటించారు. దుగరాజపట్నం, కొత్తపట్నం, కృష్ణపట్నం, కోడూరు, మైపాడు, ఇసుకపల్లి వద్ద తీరంలో సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నాయి. తుపాను తీవ్రతను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేక అధికారుల పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు గూడూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో 0861-2331261, వాట్సాప్ 7995576699 నంబర్లను అందుబాటులో ఉంచారు.

     

    • విద్యుత్‌ శాఖ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 

     

    మరోవైపు మురుసు తుపాను నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యుత్‌శాఖ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లను ఏర్పాటు చేసింది. సహాయం కోసం సంప్రదించాలని సూచించింది. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912ను కూడా అందుబాటులో ఉంచింది. ప్రజలు తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తాకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

     

    కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు

     

    కృష్ణా – 6281709355

    ఎన్టీఆర్ – 9440817561

    గుంటూరు – 9440817526

    బాపట్ల – 9281413774

    ప్రకాశం – 9440817491

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    అర్నబ్ తుపాన్ బీభత్సం – రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు

    అక్షర ఉదయమ్, అమరావతి :  అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ...

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...