మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    అక్షర ఉదయమ్, విజయవాడ :

     

    మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

    నవంబర్‌ 18న ప్రత్యేక సమావేశానికి సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. నవంబర్‌ 23న ఉదయం 11 గంటలకు వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరపాలని, ఆ రోజు ఎన్నిక జరగక పోతే నవంబర్‌ 24న ఉదయం 11 గంటలకు నిర్వహించాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తించేలా జాబితా విడుదల చేసింది.

    ఎన్టీఆర్‌ జిల్లాలో తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో, కృష్ణా జిల్లాలో పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీల్లోనూ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరుగుతుంది. గతంలో జారీ చేసిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసి తాజా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    పిడుగురాళ్ళ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించ బోతున్నాం – వైద్యులు వున్నం దంపతుల ధీమా

    అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో...

    గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే యరపతినేని విజ్ఞప్తి

    అక్షర ఉదయమ్ - పల్నాడు జిల్లా :   ఏపీలో మురసు తుఫాన్ హెచ్చరికల...

    తితిదే పాలక మండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం

    అక్షర ఉదయమ్ - తిరుమల :  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి...
    App Icon

    Install Akshara Udayam App

    Add to home screen for faster loading and latest updates.