పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన అధికారులు

అక్షర ఉదయమ్ – పొన్నూరు

 

ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి ఈ 27న జరిగే ఎన్నికలకు సంబంధించి శుక్రవారం పొన్నూరు పట్టణంలోని జడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను తాసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్, కమిషనర్ రమేష్ బాబు, రూరల్ సిఐ కోటేశ్వరరావు పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో తీసుకోవలసిన చర్యలు, పటిష్ట భద్రత ఏర్పాట్లుపై స్థానిక అధికారులతో చర్చించారు.