
– గుంటూరు జిల్లా పోలీస్
ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అనేది ఆధార్ నంబర్ వంటిది – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు
శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో ఆటోలకు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ నంబర్ల కేటాయింపు.
ఈరోజు(01.02.2025) గుంటూరు తూర్పు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్ పోలీస్ ఆటో నంబర్లను ఆవిష్కరించిన గుంటూరు ఎస్పీ గారు.
శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ:
???? ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు,తాము ప్రయాణిస్తున్న ఆటోలకి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు, వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి భరోసా కల్పించడమే ఈ ట్రాఫిక్ పోలీస్ నెంబరు కేటాయింపు యొక్క ముఖ్య ఉద్దేశం.
???? ప్రతి ఒక్క ఆటో డ్రైవరు/ఓనర్లు ఈ ట్రాఫిక్ పోలీస్ నెంబరు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ నెంబర్ తీసుకోవాలంటే ఆటో ఓనర్ మరియు డ్రైవర్లు తమ వాహనం యొక్క పూర్తి వివరాలుతో పాటు తమ ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్ ను, పాస్పోర్ట్ సైజు ఫోటోలను పోలీసు వారికి అందించవలసి ఉంటుంది. ఆ వివరాలను పోలీసు వారు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన వెబ్సైట్లో పొందుపరిచి,ఆ వివరాలతో కూడిన ఒక క్యూఆర్ కోడ్ తో రూపొందించిన ప్రత్యేకమైన ట్రాఫిక్ పోలీస్ నెంబర్ కలిగిన స్టిక్కర్ ను ఆటోల డ్రైవర్లు/ ఓనర్లలకు అందించడం జరుగుతుంది.పైవివరాలు లేనిదే ఆటోలకు ఈ ట్రాఫిక్ పోలీస్ నెంబర్ ఇవ్వడం జరగదు కావున నిజమైన ఆటో డ్రైవర్లు లేదా ఓనర్లను గుర్తించడం సులభం అవుతుంది.
???? ఈ ఫిబ్రవరి 28వ తేదీ లోపు ఈ ట్రాఫిక్ పోలీసు నెంబర్లను తప్పనిసరిగా ప్రతి ఒక్క ఆటోపై కనిపించే విధంగా అంటించవలసి ఉంటుంది. దీనివలన ఆటోలు ఎక్కే ప్రయాణికులకు మాత్రమే కాకుండా ప్రజలకు, సీసీ కెమెరాలకు కూడా ఈ ట్రాఫిక్ పోలీస్ నెంబర్లు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు/ ప్రయాణికులు ఆటోల్లో తమ విలువైన వస్తువులు మర్చిపోయినప్పుడు/ ఆటోలను దొంగిలించి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ఈ ట్రాఫిక్ పోలీసు నెంబర్ ఆధారంగా వారిని కనిపెట్టడానికి వీలవుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు కూడా సీసీ కెమెరాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
???? ఒకసారి ఒక ఆటోకి కేటాయించిన ట్రాఫిక్ పోలీస్ నంబరు మరల రెండో ఆటోకి కేటాయించడం జరగదు కావున ఈ ట్రాఫిక్ పోలీస్ నంబర్లు అనేవి ఆటోలకు ఆధార్ కార్డుల వలె పని చేస్తాయి.
???? కావున గుంటూరు పట్టణ ఆటో డ్రైవర్లు మరియు ఓనర్లు ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించి తమ వివరాలను అందించి ట్రాఫిక్ పోలీస్ నెంబరు పొందాలని, నేర నియంత్రణ మరియు ట్రాఫిక్ నియంత్రణ కొరకు పోలీసు తీసుకొని నిర్ణయాలకు మీ సహకారాన్ని అందించాలని కోరుతున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.
కార్యక్రమం అనంతరం నవీకరించిన తూర్పు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి, పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరు, ట్రాఫిక్ సంబంధించిన ఉపకరణాల యొక్క అవసరత గురించి ఆరా తీసి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన పలు చర్యల గురించి పోలీసు అధికారులకు శ్రీ ఎస్పీ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ట్రాఫిక్ డిఎస్పి రమేష్ గారు, ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ గారు, ఎస్ఐలు రవీంద్ర బాబు గారు, శ్రీహరి గారు, సాంబశివరావు నాయక్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
అక్షర ఉదయమ్