రాజమండ్రిలో చేతి వృత్తుల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

అక్షర ఉదయమ్ – రాజమండ్రి

రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు, మగ్గం, కంప్యూటర్లలో శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్. గుబ్బల రాంబాబు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 9వ తారీకు నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని ఆసక్తి గల మహిళలు లాలా చెరువు స్వర్ణాంధ్ర సేవాకేంద్రంలో సంప్రదించాలన్నారు. వివరాలకు శిక్షణ కేంద్రం వద్ద సంప్రదించాలన్నారు. ఇప్పటి వరకూ 20, 000 మంది మహిళలకు శిక్షణ అందజేశామన్నారు.