ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ ఓనర్స్ తో మీటింగ్ నిర్వహించిన అడ్మిన్ డిసిపి శ్రీమతి సరిత ఐ.పి.ఎస్. గారు

అక్షర ఉదయమ్ – విజయవాడ

పోలీస్ కమీషనర్ శ్రీ. ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. గారి యొక్క ఆదేశాల మేరకు అడ్మిన్ D.C.P శ్రీమతి. K.G.V సరిత ఐ.పి.ఎస్ గారు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ ఓనర్స్ కు మీటింగ్ నిర్వహించడమైనది.

మీటింగ్ లో భాగంగా ఉమెన్స్ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలని, హాస్టల్ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా జరిగితే వెంటనే తెలియజేయాలి అన్నారు, సురక్ష కమిటీ లో ప్రతి ఒక్కరు స్వతంత్రంగా కలవాలని చెప్పినారు. ఈ మీటింగ్ లో సుమారు 160 మంది లేడీస్ హాస్టల్ ఓనర్స్ పాల్గొనడం జరిగింది.