18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు
– సాంస్కృతిక కార్యక్రమాలకు సర్వం సిద్ధం
– బహుమతులు, క్రీడా సామాగ్రిని పరిశీలించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అక్షర ఉదయమ్ – అసెంబ్లీ ప్రతినిధి
బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభ్యులకు మార్చి 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ అనూరాధ, మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు.
18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. విజేతలకు ప్రైజులు, మెమెంటోలు అందజేయడం, క్రీడల్లో పాల్గొనే వారికి గాను ప్రత్యేక డ్రెస్సు శాప్ చైర్మన్ రవి నాయుడుకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమాలు రాజకీయ నాయకులకు రిలీఫ్ కలిగించేలా నిర్వహించాలని, ఇంకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.
మార్చి 20న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో విప్ గణబాబు, శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సుందరపు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.