అక్షర ఉదయమ్ – విజయవాడ

ఏపీలో ఏన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ వాట్సాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం విధితమే. దూర ప్రాంత బస్సు సర్వీసులన్నింటిలో వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం కల్పించారు. ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
బుకింగ్ కొరకు 9552300009 నెంబర్ కి వాట్సాప్ సందేశం పంపండి.