అక్షర ఉదయమ్ – మార్కాపురం

మార్కాపురం రైల్వే స్టేషన్ లోని లిప్టులో ఇరుక్కున్న ప్రయాణికులను ఆర్పిఎఫ్ పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. తిరుపతి నుండి మార్కాపురం రైల్వే స్టేషన్ చేరుకున్న 14 మంది ప్రయాణికులు అధిక లోడ్ తో లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ ఎస్ఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. అనంతరం ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.