వడ్లమూడి క్వారీ తిరునాళ్ళ సందర్భంగా వాహనదారులకు చేబ్రోలు పోలీసువారి సూచనలు

అక్షర ఉదయమ్ – చేబ్రోలు

 

వడ్లమూడి క్వారీ తిరునాళ్ళ సందర్భంగా వాహనదారులకు చేబ్రోలు పోలీసువారి సూచనలు

గుంటూరు నుండి తెనాలి వైపు వెళ్ళు వాహనాలు:-

బుడంపాడు అండర్ పాస్ నుండి ఎడమ వైపుగా తక్కెళ్ళపాడు- ఉప్పలపాడు- కొలకలూరు- నందివెలుగు మీదుగా వెళ్లాలని, మరలా తిరిగి అదే దారిలో రావాలని సూచన.

గుంటూరు నుండి పొన్నూరు వైపు వెళ్ళు వాహనాలు:-

బుడంపాడు అండర్ పాస్ నుండి కుడి వైపుగా ఏటుకూరు బైపాస్ నుండి ప్రతిపాడు – పెదనందిపాడు – కాకుమాను మీదుగా పొన్నూరు వెళ్లాలని, మరలా అదే దారిలో రావాలని సూచన.

గుంటూరు నుండి తిరునాళ్ళకు వెళ్లు వాహనాలు:-

నారాకోడూరు మినీ బైపాస్ మీదుగా తిరునాళ్ళ వద్దకు చేరుకోవాలని, తిరిగి వెళ్ళు వాహనాలు వేజెండ్ల అడ్డరోడ్డుకు ఎదురుగా ఉన్న రోడ్డు నుండి చేబ్రోలు చేరుకుని రెడ్డి పాలెం – లేమల్లె పాడు – ఏటుకూరు మీదుగా గుంటూరు చేరుకోవాలని సూచన.

తెనాలి నుండి తిరునాళ్లకు వచ్చు వాహనాలు:-

వడ్లమూడి అడ్డరోడ్డు గుండా వడ్లమూడి గ్రామంలో నుండి తిరునాళ్ళకు చేరుకోవాలని, తిరిగి వెళ్ళే వాహనాలు తెనాలి ప్రధాన రహదారిలో వెళ్ళాలని సూచన.

పొన్నూరు నుండి తిరునాళ్లకు వచ్చు వాహనాలు:-

చేబ్రోలు నుండి వడ్లమూడి వెళ్లే మార్గం ద్వారా తిరుణాలకు చేరుకోవాలని, మరలా అదే మార్గంలో తిరిగి వెళ్ళాలని సూచన.

భక్తులు ప్రజలు సందర్శకులు పోలీసువారి సూచనలను పాటించి, ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని పోలీస్ వారి విజ్ఞప్తి.