రాష్ట్రంలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

ఉష్ణోగ్రతలు 38°C-40°C మధ్య నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనట్లు రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

 

మే 20, మంగళవారం:

తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

మే 21, బుధవారం:

అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, చిత్తూరు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

మే 22, గురువారం:

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సోమవారం రాత్రి 7 గంటల నాటికి అల్లూరి జిల్లా ఏటపాకలో 41.2మిమీ, మన్యం జిల్లా కురుపాంలో 36.7మిమీ, ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో 33.5మిమీ వర్షపాతం రికార్డు అయినట్లు తెలిపారు.

మరోవైపు సోమవారం విజయనగరం జిల్లా గజపతినగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా బుట్టాయిగూడెంలో 38.1°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

 

 – “అక్షర ఉదయమ్” న్యూస్ 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..