“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్

తమ సమస్యలను విన్నవించుకున్న 50 మంది అర్జీ దారులు
నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోము
– జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్
నిర్ణిత గడువులోగా అర్జీ దారుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు.

పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిచిన పిజిఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు వారి సమస్యలను స్వేచ్ఛగా ఎస్పీకి విన్నవించుకున్నారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ-ఆస్థి వివాదాలు, ఇతర సమస్యలపై వచ్చిన 50 అర్జీలను ఎస్పీ పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కరానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు. పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని పోలీస్ అధికారులను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, పిజిఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీనివాస్ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
అక్షర ఉదయమ్ – బాపట్ల
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..