పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించండి: పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఐపీఎస్

పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించండి: పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఐపీఎస్

 

అక్షర ఉదయమ్ – పల్నాడు

ప్రతి రోజు రెండు పూటల రోల్ కాల్ (Roll Call) నిర్వహించి, వారానికి కనీసం ఒకసారి పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించాలి.

జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు, ఐపీఎస్ గారి అధ్యక్షతన “సెప్టెంబర్ – 2025 నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం” నిర్వహించబడింది.

ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు మాట్లాడుతూ

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర,నాణ్యమైన సేవలందించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

గౌరవ ఎస్పీ గారి ముఖ్య సూచనలు:

పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో (విజిబుల్ పోలీసింగ్) ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.

పోలీస్ స్టేషన్ రిసెప్షన్ వద్ద నైపుణ్యం కలిగిన, మర్యాదపూర్వకంగా వ్యవహరించే సిబ్బందిని నియమించి, ప్రజల ఫిర్యాదులను బాధ్యతతో పరిష్కరించాలి.

PGRS కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను సమయానుకూలంగా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలి.

మహిళల నుండి అందే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయదగిన నేరమైతే వెంటనే నమోదు చేయాలి.

60,90 రోజుల వ్యవధిలో దర్యాప్తు పూర్తి చేయాల్సిన కేసులను వేగంగా పూర్తి చేసి, న్యాయస్థానంలో ప్రాథమిక ఛార్జిషీట్ సమర్పించాలి.

శక్తి కాల్స్ అందిన వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకొని పరిష్కారం చూపించాలి.

మహిళా పోలీసుల సహకారంతో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వారితో ప్రతీ వారానికి సమావేశాలు నిర్వహించి గ్రామాలు/వార్డుల శాంతి భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణపై సమీక్ష చేయాలి.

డయల్ 100, 112 ద్వారా అందే కాల్స్‌కు వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలి.

రాత్రి గస్తీ వ్యవస్థను A,B,C,D బృందాలుగా విభజించి, విధులు వలయాకార (Clockwise) పద్ధతిలో అమలు చేయాలి.

చట్టపరమైన నిబంధనలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

రాత్రిపూట అనుమానాస్పదంగా తిరిగే వారిని అదుపులోకి తీసుకొని సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలు పరిశీలించాలి.

విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల పరిసరాల్లో పగటి గస్తీ కొనసాగించాలి.

Drunk & Drive, Open Drinking, Cell Phone Driving తనిఖీలను ప్రతిరోజూ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలి.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ గస్తీ నిర్వహించి, నిర్మానుష్య ప్రదేశాలు, విడిచిపెట్టిన భవనాలను పర్యవేక్షించి,అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలి.

చీకటి, జనసంచారం లేని ప్రాంతాల్లో సంబంధిత అధికారుల సమన్వయంతో లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయించాలి.

రౌడీషీటర్లపై నిఘా ఉంచి,తరచూ నేరాలకు పాల్పడే వారిపై కొత్త రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి.

పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను CCTNS లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి; ప్రతి 15 రోజులకు ఒకసారి తనిఖీ నిర్వహించాలి.

సాంకేతిక పరికరాలను వినియోగించి పరారీలో ఉన్న నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కనుగొనాలి.

పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పనిసరిగా సమస్యాత్మక గ్రామాలలో పల్లె నిద్ర కార్యక్రమం మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

రానున్న దీపావళి పండుగ దృష్ట్యా, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాణసంచా విక్రయ షాపులు, స్టాక్, లైసెన్సులు వంటి అంశాలను పరిశీలించి, అనుమతి లేని విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీలు శ్రీ JV.సంతోష్ గారు (అడ్మిన్), శ్రీ లక్ష్మీపతి గారు (క్రైమ్స్), డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.