మహిళల భద్రతకు “శక్తి వాట్సాప్ నెంబర్” 79934 85111

📰 Generate e-Paper Clip

మహిళల భద్రతకు “శక్తి వాట్సాప్ నెంబర్79934 85111

 


అక్షర ఉదయమ్ – మంగళగిరి

మహిళలు, చిన్నారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తీసుకొచ్చిన “శక్తి” యాప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి విదితమే.

మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ “ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్” శక్తి వాట్సాప్ నెంబర్ 79934 85111 అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది.

మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శక్తి వాట్సాప్ నెంబర్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సప్ నెంబరు కాల్ (వీడియో, నార్మల్ కాల్), మేసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు.

24/7 ఈ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సాంకేతికత సహాయంతో మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టడం జరుగుతుందని తెలిపారు.

మహిళలు విధిగా తమ మొబైల్ లో ఈ శక్తి వాట్సాప్ నెంబర్ ను సేవ్ చేసుకోవాలని ఐజీపీ బి.రాజకుమారి కోరారు.

ఈ కార్యక్రమంలో “ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీపీ శ్రీమతి బి. రాజకుమార్, ఎస్పీ శ్రీదేవి రావు తదితరులు పాల్గొన్నారు.

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..