క్షేత్ర స్థాయిలో నేరస్తుల కదలికలను కనిపెట్టి, వారిని నియత్రించేందుకే ఈ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్- ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు

క్షేత్ర స్థాయిలో నేరస్తుల కదలికలను కనిపెట్టి, వారిని నియత్రించేందుకే ఈ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్.- ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు

అక్షర ఉదయమ్ – గుంటూరు

ఈరోజు(13.05.2025) కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోట కాలనీలో ఈస్ట్ డిఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(Cardon and Search Operation – CASO)” లో స్వయంగా పాల్గొని, పర్యవేక్షించిన శ్రీ ఎస్పీ గారు.

నేరస్తుల కదలికలను కనిపెట్టి, అసాంఘిక మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధించడానికి సుమారు 80 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగినది.

 

ఈ ఆపరేషన్ లో సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని 63 వాహనాలను(60 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు) స్వాధీనం చేసుకోవడం జరిగింది.వారికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలను పోలీస్ వారికి అందిస్తే వాటిని తిరిగి సంబంధిత యజమానులకు అందిస్తామని లేని ఎడల కేసులు నమోదు చేస్తాము.

శాంతి భద్రతలను పరిరక్షించడానికి అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడం,జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం వంటివి ముఖ్య లక్ష్యాలుగా ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు, లాలాపేట సీఐ శివప్రసాద్ గారు, పాత గుంటూరు సిఐ సోమయ్య గారు, ఇతర సీఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..