రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

బుధవారం(14-05-25) అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు , గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.
అలాగే ఉష్ణోగ్రతలు 41-43°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.
విజయనగరం-3,
పార్వతీపురంమన్యం-8,
తూర్పుగోదావరి-1
మండలాల్లో తీవ్రవడగాలులు (12), మరో 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
వడగాలులు వీచే మండలాల వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/c425b31fb2e7e904745f42519b984184.pdf
మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.2°C, అల్లూరి సీతారామరాజు జిల్లా కొండాయిగూడెం 42.9°C, నెల్లూరు జిల్లా దగదర్తి, ప్రకాశం జిల్లా దరిమడుగులో 42.8°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, ఏలూరు జిల్లా రాజుపోతెపల్లె, పల్నాడు జిల్లా అమరావతిలో 42.7°C, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 42.4°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 16 ప్రాంతాల్లో, పల్నాడు 10 , ఏలూరు 8, ప్రకాశం 8, తిరుపతి 8 సహా ఇతర చోట్ల కలిపి 74 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వివరించారు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
Play Store https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..