రేపటి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం
– మంత్రి నాదెండ్ల
కొత్త కార్డులు, మార్పులు – చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చు.
రేషన్ కార్డుల మార్పు కోసం 3.28లక్షల దరఖాస్తులు వచ్చాయి.

క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తాం.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 6 నెలల రేషన్ వివరాలు తెలుస్తాయి.
స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి.. స్మార్ట్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు.
రేషన్‌కార్డు కోసం నెల పాటు దరఖాస్తు చేసుకోవచ్చు.. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ చేస్తాం.
వచ్చే నెల నుంచే స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం.. ప్రస్తుతం 95 శాతం ఈ-కేవైసీ పూర్తయ్యింది.
ఈ-కేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయనక్కర్లేదు.
– మంత్రి నాదెండ్ల మనోహర్
– అక్షర ఉదయమ్ – అమరావతి