80’స్ తారల రీయూనియన్

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    80’స్ తారల రీయూనియన్

     

    80ల్లో వెండితెర వేదికగా సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటులందరూ ఒకేచోట కలిశారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తం 31 మంది స్టార్స్ కలిసి అక్టోబర్ 4న చెన్నైలో పార్టీ చేసుకున్నారు. అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్ వేడుకలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. గతేడాది ఇది జరగాల్సి ఉండగా.. చెన్నైలో వరదల కారణంగా వాయిదా పడింది.

    ఈ వేడుకల్లో తారలంతా అలనాటి విశేషాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్ కుమార్ సేతుపతి, నరేశ్, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభనలతో పాటు మరికొందరు అగ్రతారలు సందడి చేశారు.

    ఈ ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలని పేర్కొన్నారు. “80ల నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేను. దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ బంధం విడదీయరానిది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు.. మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది. ప్రతిసారి మొదటి సమావేశంలానే ఉంటుంది అని చిరు రాసుకొచ్చారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    అర్నబ్ తుపాన్ బీభత్సం – రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు

    అక్షర ఉదయమ్, అమరావతి :  అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ...

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...