మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం

అక్షర ఉదయమ్ – కాకినాడ

 

కాకినాడ జిల్లాలోని తొండంగి మండలంలోని 16 గ్రామాల ప్రతినిధులతో కాకినాడ కలెక్టర్ షన్మోహన్ సోమవారం సమావేశం నిర్వహించారు. దివీస్ ఫ్యాక్టరీ వేస్తున్న పైప్ లైన్ తో మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు ఓ కమిటీ వేశామని చెప్పారు. పైప్ లైన్ తో మత్స్య సంపదకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందనే అంశం పై ఆ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఆయా గ్రామ ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.