పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ను ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

– గుంటూరు జిల్లా పోలీస్

ప్రజలకు రహదారి భద్రత గురించి, ట్రాఫిక్ నియమాల గురించి తెలియపరచడంలో పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు

ఈ రోజు గుంటూరు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్టుగుంట సెంటర్ నందు గల ట్రాఫిక్ పోలీస్ అవుట్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ను ప్రారంభించి, ట్రాఫిక్ పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ గారు

ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ

???? ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీస్ వారికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం కూడా తోడవడంతో ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వారికి ట్రాఫిక్ నియంత్రణ అనేది సులభతరం అవుతుంది.

???? పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టంను ఉపయోగించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ హెచ్చరికలు జారీ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్ సమాచారం, అత్యవసర ట్రాఫిక్ డైవర్షన్లు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ గురించి, ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్లు మూసివేసిన సమాచారం, ట్రాఫిక్ నియమాల గురించి ప్రజలకు తెలియపరచడం, ఏవైనా అత్యవసర పరిస్థితులు గురించి వాహనదారులకు, ప్రజలకు తెలియపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ఒకేసారి ఎక్కువ సంఖ్యలోని వాహనదారులకు తక్షణ హెచ్చరికలు లేదా సూచనలు ఇవ్వడానికి, అదేవిధంగా వాహనదారులకు అవగాహన కల్పించడానికి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వేగంగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా ట్రాఫిక్ వ్యవస్థలో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయని ఆశిస్తూ, ట్రాఫిక్ పోలీసు వారు ఈ సిస్టం ద్వారా మరింత సమర్థవంతంగా ట్రాఫిక్ నిర్వహణను చేపట్టాలని సూచిస్తున్నట్లు తెలిపారు.

ప్రతియేటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా గుర్తిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడంలో భాగంగా మణిపాల్ హాస్పిటల్, తాడేపల్లి వారు ట్రాఫిక్ పోలీస్ వారికి విధి నిర్వహణలో అవసరమైన సుమారు 200 రేడియం జాకెట్లను శ్రీ ఎస్పీ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ రేడియం జాకెట్లు ట్రాఫిక్ నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి, వాహనదారులకు ట్రాఫిక్ పోలీసు వారు కనిపించడానికి ఈ రేడియం జాకెట్లు ఉపయోగ పడతాయని, వీటిని అందించి న మణిపాల్ హాస్పిటల్, తాడేపల్లి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.

????ట్రాఫిక్ పోలీసు వారు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ సాధ్యమైనంత వరకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తున్నారని, వారి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రానున్న వేసవికాలంలో విధి నిర్వహణకు అవసరమైన టోపీలు, కళ్ళజోళ్ళు, గ్లూకోజ్, తాగునీటి సదుపాయాలు మొదలగు వాటిని ఏర్పాటు చేస్తామని, ట్రాఫిక్ సిబ్బంది యొక్క ఆలోచనలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు ట్రాఫిక్ డిఎస్పి రమేష్ గారు, ట్రాఫిక్ సీఐలు అశోక్ కుమార్ గారు, సింగయ్య గారు, ఎస్సైలు శ్రీహరి గారు, సాంబశివరావు నాయక్ గారు మరియు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.