స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి
- అద్దంకి నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్
అక్షర ఉదయమ్ – అద్దంకి

అద్దంకి నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అద్దంకి నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రసంగిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా, సమర్థ వంతంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులు కెవి ప్రసాద్, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.