వరికపూడిశెల ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి
- మంత్రి నిమ్మల రామానాయుడు
లక్ష్మణరావు మల్లెంశెట్టి
అక్షర ఉదయమ్ ఎడిటర్

పల్నాడు జిల్లాలోని ప్రతిష్టాత్మక వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పురోగతిపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
- ముఖ్యమైన నిర్ణయాలు
ప్రాజెక్టు భూ సేకరణ కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.63.14 కోట్లు మంజూరు చేసింది. పైప్లైన్ నెట్వర్క్ పనుల కోసం భూసేకరణను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు.
- అక్టోబర్ 31 నాటికి డీపీఆర్
84,500 ఎకరాలకు సాగు నీరు అందించేలా అక్టోబర్ 31 నాటికి డీపీఆర్, పబ్లిక్ హియరింగ్ పూర్తి చేయాలని నిర్ణయించారు.
- పర్యావరణ అనుమతులు
కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరితగతిన పర్యావరణ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.
పల్నాడు ప్రాంత రైతులకు సాగు నీరు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుందని మంత్రి రామానాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు.