మొదటి ఉచిత సిలెండర్ తీసుకోలేదా

అక్షర ఉదయమ్ – అమరావతి

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడత ఇంకా తీసుకోని వారు బాధపడాల్సిన పనిలేదు. వారికి ఇంకా గడువు ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీపం-2 పథకం కింద లబ్దిదారులు మార్చి 31 లోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్ ను బుక్ చేసుకుని పొందవచ్చని ఏపీ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. మార్చి 31 తరువాత గ్యాస్ బుక్ చేసుకుంటే అది రెండో విడత గ్యాస్ సిలిండర్ కిందకి వస్తుంది.