
అక్షర ఉదయమ్ – నరసరావుపేట
నరసరావుపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ల పై రూరల్ ఎస్ఐ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం చిలకలూరిపేట రోడ్లోని ఎలీ నగర్ మొదట లైన్లో ఉన్న మసాజ్ సెంటర్ ని చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారనే స్థానికుల సమాచారంతో తనిఖీ చేశారు. నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటు ముగ్గురు యువతలను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.