సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు

అక్షర ఉదయమ్ – చీరాల

చీరాలలోని వాడరేవు సముద్రంలో వేటకు వెళ్లిన ఓసిపిల్లి రమణ (57) అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. చీరాల వాడరేవుకు చెందిన అయన ముగ్గురు మత్స్యకారులతో ఆదివారం వేటకు వెళ్లాడు. సోమవారం రాత్రి నిద్రిసుండగా పడవలో నుంచి జారీ సముద్రంలోకి పడిపోయాడని, ఎంత వెతికినా ఆచూకీ దొరకపోవడంతో చివరికి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం వరకు ఆచూకం లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.