
అక్షర ఉదయమ్ – తిరుమల
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రవాస భారతీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్యూస్ చెప్పింది. ఎన్ఆర్ఐలకు ప్రస్తుతం టీటీడీ కల్పిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను 50 నుంచి 100కు పెంచుతున్నట్లు డిప్యూటీ ఈఓ లోకనాథం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం జీఏడీ నుంచి వారి కోటా పెంచాలని జనవరి 6న లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ సదుపాయం బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో వర్తించదు.