
అక్షర ఉదయమ్ – తెనాలి
ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్ ను వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెనాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. సిఐ గారు మాట్లాడుతూ అలాగే +3, +5, +9, +2 సిరీస్ లో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే 3 సెకన్లలో ఫోన్లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని, ఆ డేటా తో మోసాలను చేస్తున్నారని తెలిపారు.