రేపల్లె పట్టణంలో వృద్ధురాలి దారుణ హత్య

అక్షర ఉదయమ్ – రేపల్లె

రేపల్లె పట్టణంలో మూడో వార్డులో శనివారం రాత్రి వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పసుపులేటి నరసమ్మ (70) అనే వృద్ధురాలను గుర్తు తెలియని దుండగులు పీక కోసి చంపేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె హత్యకు గురి కావడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.