– టిడిపి యువ నాయకులు యరపతినేని నిఖిల్
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు త్వరలోనే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, క్రీడాకారులు అందరికీ కానుకగా అందిస్తారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఎమ్మెల్యే యరపతినేని తనయుడు యరపతినేని సాయి నిఖిల్ అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని స్కాలర్ డిగ్రీ కాలేజీ ఆవరణలో గత 20 రోజుల నుంచి జరుగుతున్న కీర్తిశేషులు యరపతినేని లక్ష్మయ్య స్మారక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు యరపతినేని నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా యరపతినేని నిఖిల్ మాట్లాడుతూ గత 20 రోజుల నుంచి పిడుగురాళ్పళ ట్టణంలో మా తాతయ్య లక్ష్మయ్య పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని చెప్పారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వక్తలు చెప్పిన విధంగా పిడుగురాళ్ళ పట్టణంలో క్రీడా ప్రాంగణం లేకపోవడం ఎంతో బాధాకరమని అభిప్రాయ పడ్డారు . 2014వ సంవత్సరంలో ఆనాటి శాసన సభ్యులుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు చొరవతో క్రీడా ప్రాంగణం మంజూరు చేయించి, అనుమతులు తీసుకువచ్చి చెరువు ప్రాంతంలో స్థలం కేటాయించటం కూడా జరిగిందని తెలిపారు. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పారు. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు త్వరలోనే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కానుకగా అందిస్తారని స్పష్టం చేశారు . ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపోటములు సహజం, కానీ గెలిచేది ఒకరే కాబట్టి వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుందని, ప్రైజులు రాలేదని బాధ పడుతూ వెనకడుగు వేయక ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఇంకా ముందు ముందు మంచి ప్రైజులు పొంది క్రికెట్ రంగంలో ముందుకు రావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జరిగిన సభకు పల్నాడు జిల్లా టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ అధ్యక్షత వహించగా, అతిథులుగా టిడిపి నాయకులు నాయకులు తురకా వీరాస్వామి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ముప్పన వెంకటేశ్వర్లు, వడ్డవల్లి సర్వేశ్వరరావు, పాండురంగ శ్రీను, పిల్లి చెన్నారావు, కనిగిరి శ్రీనివాసరావు, పిడుగురాళ్ళ పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సైదా, జనసేన పార్టీ మండల కన్వీనర్ కామిశెట్టి రమేష్, జిల్లా కార్యదర్శి దూదేకుల ఖాసిం సైదా, స్కాలర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆవుల జనార్ధన్, తెలుగు యువత నాయకులు శ్రీహరి, యడవల్లి కొండలు, కందిమల్ల శీను, షేక్ సలీం జమ్మిశెట్టి రామకృష్ణ, ఉన్నం సురేష్ కూరపాటి కొండలు నల్ల పోతుల గాలయ్య తదితరులు పాల్గొన్నారు.
గత 20 రోజులుగా జరుగుతున్న పోటీల్లో మొదటి బహుమతిని పల్నాడు ఓవర్సీస్ (సత్తెనపల్లి) లక్ష రూపాయలు గెలుచుకోగా, రెండవ బహుమతిని కోటి ఫ్రెండ్స్ (వేటపాలెం), మూడవ బహుమతిని కేఆర్ లయన్స్ (చిలకలూరిపేట) 30 వేల రూపాయలు గెలుచుకున్నారు.
బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ గా క్రాంతి, బెస్ట్ బౌలర్ గా షేక్ మూసలు బహుమతిని గెలుచుకోవడం జరిగిందని నిర్వాహకులు షేక్ ఈసా, షేక్ మూసా, మీనిగల అంజిబాబు, యరగాని వెంకట్ లడ్డు, సురేష్ గోపి వాల్మీకి, అంకాల అశోక్, గోపు నరసింహారావు, సాయి కృష్ణ, సిద్దు, హనుమ, నాగేంద్రబాబు, సూర్య, ఇందూరి మహేష్, దూదేకుల సలీం, వెంకట్రావు తదితరులు తెలిపారు.