వృద్ధురాలు హత్య కేసులో నిందితుడు అరెస్ట్

అక్షర ఉదయమ్ – రేపల్లె

రేపల్లె మూడో వార్డులో పసుపులేటి సరస్వతి హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె మనవడుని అరెస్ట్ చేసినట్లు రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిస అయిన బాల నేరస్తుడు మద్యం సేవించి గొంతు కోసి, డబ్బులు తీసుకుని పరార్ అయ్యాడు. 24 గంటల్లో కేసును చేధించి డబ్బులు, చాకు స్వాధీనం చేసుకున్న పోలీసులను బాపట్ల ఎస్పీ తుషార్ డుడీ
అభినందించారు.