
అక్షర ఉదయమ్ – గుంటూరు
గుంటూరు మిర్చి యార్డ్ లో మంగళవారం మరో మోసం వెలుగు చూసింది. ఓ ట్రేడర్ కంపెనీ రైతుల దగ్గర నుండి 50 లక్షల రూపాయలు వరుకు డబ్బులు తీసుకొని మోసం చేసిందని భాదితులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన నగదు తమకు వెంటనే ఇప్పించాలని, ట్రేడర్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.