
అక్షర ఉదయమ్ – అమరావతి
గుంటూరు నుంచి క్రోసూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అమరావతి మండలం తురగావారిపాలెం వద్దకు రాగానే ఆర్టీసీ బస్సు ఇంజన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన బస్సు డ్రైవర్ బస్సును ఒక్క ప్రక్కగా ఆపివేసి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను దింపివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బస్సు ఇంజిన్ లోని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి తో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.