
అక్షర ఉదయమ్ – నరసరావుపేట
పల్నాడు జిల్లా నుంచి పరిశ్రమల ఎగుమతిని ప్రోత్సహించాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి విధానం పై, సూక్ష్మ చిన్న సంస్థల అభివృద్ధి ప్రోగ్రాం పై సమావేశం నిర్వహించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ అనుమతుల పురోగతి గురించి చర్చించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకంలో 4, 028 మందికి ట్రైనింగ్ ఇచ్చామన్నారు. 335 యూనిట్లకు బ్యాంకు రుణాలు అందినట్లు వివరించారు.