
అక్షర ఉదయమ్ – గుంటూరు
గుంటూరు పరిధిలోని రెడ్డిపాలెం – ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రజా సౌకర్యార్ధం తక్షణం ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, గోరంట్ల, హిమని నగర్, సరస్వతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అభివృద్ధి, పారిశుధ్య పనులను, రెడ్డిపాలెం రోడ్ నిర్మాణ పనులను కమిషనర్ పపరిశీలించారు.