ముప్పాళ్ళ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అరుణ్ బాబు

అక్షర ఉదయమ్ – సత్తెనపల్లి

ఫిబ్రవరి 27 తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగనున్న సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించారు. మంగళవారం రాత్రి సత్తనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని వసతులను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.