మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు

అక్షర ఉదయమ్ – తెనాలి

మహా శివరాత్రి సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుంచి శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి సమీపంలోని గోవాడ, క్వారీ తిరునాళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు ప్రతి 2 నిమిషాలకు ఒక్క సర్వీస్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రైవేటు వాహనాలు ఆలయాలకు కిలోమీటర్ దూరం వరకే పరిమితం అని, ఆర్టీసీ బస్సులు మాత్రం సమీపం వరకు వెళ్తాయి అని డిపో మేనేజర్ రాజశేఖర్ చెప్పారు.