సైబర్ మోసాల పై యువత అప్రమత్తంగా ఉండాలి

అక్షర ఉదయమ్ – మచిలీపట్నం

సైబర్ మోసాల పై యువత అవగాహనతో పాటు అప్రమత్తత అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్ చాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ మోసాల పై ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మంగళవారం ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సురక్షిత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు.