హెల్మెట్ డ్రైవింగ్ అవగాహన పై పిడుగురాళ్ళ పోలీసులు బైక్ ర్యాలీ

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

వాహనదారులు హెల్మెట్ ధరించక పోవడంతో చాలామంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, మానవ తప్పిదాల వల్లే 75% ప్రమాదాలు జరుగుతున్నాయని, పరిమితికి మించి వేగం, మద్యం సేవించి వాహనం నడపటం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన, ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదలు వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు అన్నారు.

ఈ కార్యక్రమంలో హెల్మెట్లు ధరించకుండా హైవే మీద ప్రయాణిస్తున్న వాహనదారులకు అవగాహన కల్పిస్తూ 100 మందికి హెల్మెట్లు ఉచితంగా అందజేశారు.