గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేయుచున్న “కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రాంగణము” మరియు “గ్రీన్ లీఫ్ టొబాకో కంపెనీ నందు ఏర్పాటు చేసిన హెలిపాడ్ ప్రాంగణాల” వద్ద బందోబస్తు ఏర్పాటులను పరిశీలించి, బందోబస్తుకు హాజరైన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసిన శ్రీ ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు.

అక్షర ఉదయమ్ – గుంటూరు
శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ బందోబస్తుకు హాజరయ్యే సిబ్బంది తప్పనిసరిగా వీవీఐపీ రాక సమయము కంటే మూడు గంటల ముందు తమకు కేటాయించిన ప్రదేశానికి చేరుకోవాలి. చుట్టు పక్కలా క్షుణ్ణంగా పరిశీలించి, వీవీఐపీ రాక సమయంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలి.

బీడీ టీం వారు సభా ప్రాంగణం మరియు హెలిప్యాడ్ చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మీ పై అధికారులకు తెలియపరచాలి
ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీలు శ్రీ GV రమణ మూర్తి గారు, ATV రవిబాబు గారు, శ్రీమతి K.సుప్రజా గారు, శ్రీ ఆ. హనుమంతు గారు, ఎస్బి డిఎస్పి సీతారామయ్య గారు పలువురు ఇంటిలిజెన్స్ మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.