విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన ఆర్టిఓ అధికారులు

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

 

నరసరావుపేట ఇంజనీరింగ్ విద్యార్థులకు రోడ్డు భద్రత పై బుధవారం రోడ్డు రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సభకి ఎన్ఎస్ఎస్ అధికారి రాజు అధ్యక్షత వహించారు. రోడ్డు భద్రత ప్రాధాన్యతను తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భద్రతా చర్యలు పాటించటం ద్వారానే ప్రమాదాలు అరికట్టి, విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతామన్నారు. హెల్మెట్, సీట్ బెల్టు తప్పని సరిగా ధరించాలన్నారు.