
అక్షర ఉదయమ్ – గుంటూరు
ఈరోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు వేలిముద్రలు, అరచేతి ముద్రలు, ఫోటోలు ద్వారా నేరస్తులను కనిపెట్టడానికి ఉపయోగించే సాంకేతిక పరికరాల గురించి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేసిన శ్రీ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు
ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ఉపయోగించి నేరస్తుల గుర్తింపు మరియు నేరాల కట్టడి అనేది సులభతరం అవుతుంది.కావున సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను సమర్థవంతంగా, పూర్తిస్థాయిలో ఉపయోగించి నేరస్తుల గురించిన పూర్తి సమాచారం సేకరిస్తామో అప్పుడే నేరం చేసిన వెంటనే నేరస్తులను గుర్తించగలం లేదా నేరం చేయకుండా వారిని కట్టడి చేయగలం.

అదే విధంగా 54 MSCD – మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైసెస్ (Mobile Security Check Devices) ఉన్నాయని వీటి ద్వారా పగలు / రాత్రి గస్తీ సమయాల్లో, విజిబుల్ పోలింగ్, కార్డాన్ & సెర్చ్, నాకాబందీ చేసే సమయాలలో అనుమానితుల వేలిముద్రలను సేకరించి, పరిశీలిస్తే పాత నేరస్తులు ఎవరైనా ఉంటే వెంటనే పసిగట్టవచ్చని, వారికి సంబంధించిన వివరాలు, వారు చేసిన నేరాలు, వారి పై ఉన్న కేసులు వెంటనే గుర్తించి, దానివలన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని మరొక నేరం జరగకుండా తగిన చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) శ్రీమతి కె.సుప్రజ గారు మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడే నేరాల దర్యాప్తులో, నేరస్తుల కదలికలను పసిగట్టుటలో పురోగతి సాధిస్తామని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వేలిముద్రల పరికరాలను ఉపయోగించాలని తద్వారా నేరస్తులు గుంటూరు జిల్లాలో నేరాలు చేయాలంటే ఆలోచించే విధంగా కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్) శ్రీమతి కె.సుప్రజ గారు, ఫింగర్ ప్రింట్ విభాగ ఎస్సై శ్రీనివాసరావు గారు, పలు పోలీస్ స్టేషన్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.