అక్షర ఉదయమ్ – గుంటూరు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా వడ్లమూడి క్వారీ తిరునాళ్ళకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయండి గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు.
చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్లమూడి గ్రామ క్వారీ వద్ద 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న క్వారీ తిరునాళ్ళకు చేయవలసిన బందోబస్తు ఏర్పాట్లు, గుడి వద్ద ఏర్పాటు చేయవలసిన భారీ కేడింగ్, ట్రాఫిక్ మల్లింపులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఎస్పీ గారు సూచించారు.

భక్తులకు, సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభల నిర్వాహకులు తమ ప్రభలను నిలుపుకోవడానికి నిర్ణీత స్థలం కేటాయించాలని, ప్రతి ప్రభ వద్ద నిర్వహకులచే డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

తదనంతరం ఆలయ ప్రాంగణంలో దీప స్తంభం నిర్మాణానికి శ్రీ ఎస్పీ గారు భూమిపూజ చేసారు. మార్గ మధ్యలో నారా కోడూరు గ్రామంలోని ప్రధాన జంక్షన్ వద్ద, నారా కోడూరు – తెనాలి రహదారి పై ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవలసిన పలు సూచనలను పోలీస్ అధికారులకు శ్రీ ఎస్పీ గారు సూచించారు.