
అక్షర ఉదయమ్ – తెనాలి
రైలులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో రైల్వే పోలీసులు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్ (17479) ఏ-1 కోచ్ లో 4 బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని గుర్తించారు. రైల్వే సీఐ శ్రీనివాసరావు, జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి 3వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై రైలులో తనిఖీలు చేశారు. తహశీల్దార్ కెవి గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చి ఆయన సమక్షంలో గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులు పరారయ్యారు. గంజాయి ఎక్కడ నుంచి తరలిస్తున్నారు, నిందితులు ఎవరన్నది విచారణ జరిపి త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిఐ శ్రీనివాసరావు తెలిపారు.
