“ఆలపాటి”ని గెలిపించండి

– పట్టభద్రులకు యరపతినేని నిఖిల్ పిలుపు

 – పిడుగురాళ్ళలో పట్టభద్రులను కలిసిన టిడిపి యువ నాయకుడు నిఖిల్, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు రాజన్ 

 

 

 

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ 

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో ఉమ్మడి గుంటూరు – కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా)ని గెలిపించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు యరపతినేని సాయి నిఖిల్ పిలుపు ఇచ్చారు. గురువారం పిడుగురాళ్ళ మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురజాల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సిఆర్.రాజన్, యువ నాయకులు యరపతినేని నిఖిల్, కూటమి నాయకులు ఉపాధ్యాయులను, అంగన్వాడి టీచర్లను కలసి, కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

అదే విధంగా పిడుగురాళ్ళ పట్టణంలోని స్కాలర్స్ స్కూల్లో, ఇందిరమ్మ కాలనీలోని కస్తూర్బా గాంధీ బాలికల (మైనారిటీ) విద్యాలయంలో, ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యువ నాయకులు యరపతినేని నిఖిల్, కూటమి నాయకులు ఉపాధ్యాయులను కలసి, కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల నుంచి యరపతినేని నిఖిల్, రాజన్, కూటమి నాయకులకు మంచి స్పందన లభించింది.