అక్షర ఉదయమ్ – నరసరావుపేట

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి మహాశివరాత్రి పురస్కరించుకొని అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఈవో చంద్రశేఖర్రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 23 నుంచి 27 వరకు స్వామివారి మూలవిరాట్ కు అభిషేకాలు రద్దు చేస్తున్నాము అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో కోటప్పకొండకు చేరుకుంటారని వివరించారు. అభిషేక మండపంలో యథావిధిగా అభిషేకాలు జరుగుతాయన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.