చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడి అరెస్ట్

అక్షర ఉదయమ్ – చిలకలూరిపేట

 

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామానికి చెందిన సింగ్ అజిత్ కుమార్ ను సీఐడీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో రూ.35 కోట్లను తన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించాడని పోలీసులు తెలిపారు. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలలో అజిత్ కుమార్ కీలక నిందితుడని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.