ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు

అక్షర ఉదయమ్ – శ్రీశైలం

 

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ రోజు ఉదయం టన్నెల్ ప్రమాదస్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చేరుకుని అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ టన్నెల్‌లో సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపారు. రాడార్ ద్వారా నలుగురి మృతదేహాలు ఒకచోట, మరో ఇద్దరివి మరోచోట, మరో ఇద్దరివి మరోచోట గుర్తించారని తెలిపారు. రేపు మధ్యాన్నం వరకు నలుగురి ఆచూకీ దొరుకుతుందన్నారు. మిగిలిన వారి ఆచూకీ మరింత సమయం పడుతుందని తెలిపారు. టన్నెల్ బోరు మిషన్ కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు. టన్నెల్ సహాయక చర్యల పై ప్రతిపక్షాలు ఘటన పై ఇష్టానుసారంగ మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత వారం రోజులుగా టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చివరకు టన్నెల్‌ ప్రమాదంలో ఆ ఎనిమిది ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.