
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎంతో నియమ, నిష్టలతో నెల పాటు ఉపవాస దీక్షలు తీసుకుని ఉపవాసాలు ఉండి ఆదివారం ఉపవాస దీక్షలు ముగించుకుని, ఈదుల్ ఫితర్ నమాజ్ చదువుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులకు గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముస్లింలు అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని, అన్ని వృత్తులకు సంబంధించిన వారు చేతినిండా పని ఉండి అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలని “అల్లాహ్” ని వేడుకుంటున్నానని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.