ఐపీఎల్ 2025 సిరీస్ నిరవధిక వాయిదా

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    ఐపీఎల్ 2025 సిరీస్ నిరవధిక వాయిదా

     

    – మిగతా అన్ని మ్యాచ్ లు రద్దు చేసిన బీసీసీఐ

     

    ఐపీఎల్ 2025ను బీసీసీఐ రద్దు చేసింది. ఇవాల్టి నుంచి అంటే మే 29 నుంచి తర్వాత జరగ వలసిన మ్యాచులు అన్నింటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

     

    ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, సరిహద్దుల్లో జరుగుతున్న దాడుల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఐపీఎల్ 2025 సిరీస్ ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

     

    ఐపీఎల్ కోసం.. ఇతర దేశాల నుంచి ఎంతో మంది క్రికెటర్లు ఇండియా వచ్చారు. వారి భద్రత కూడా ఎంతో ముఖ్యం. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు, యుద్ధం వస్తే తీసుకోవాల్సి జాగ్రత్తలపై ఓ వైపు మాక్ డ్రిల్స్ నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచులకు భద్రత అనేది సవాల్ గా మారింది.

     

    ఐపీఎల్ మ్యాచ్ లను ఉగ్రవాదులు, టెర్రిరస్టులు టార్గెట్ చేసే అవకాశాలు లేక పోలేదు. అంతే కాకుండా క్రికెట్ మ్యాచుల కోసం లక్షల మంది సమూహంగా.. క్రికెట్ స్టేడియాల్లో ఉంటారు. ఇలాంటి యుద్ధ వాతావరణం క్రమంలో ఏదైనా జరగ రానిది జరిగితే అది అతి పెద్ద విపత్తుగా మారే ప్రమాదం లేక పోలేదు. సెక్యూరిటీ కూడా భద్రతా దళాలకు, లోకల్ పోలీసులకు సవాల్ గా మారనుంది. లక్షల మంది క్రికెట్ స్టేడియాలకు రావటం.. విదేశీ ఆటగాళ్ల భద్రత అనేది.. ఇలాంటి యుద్ధ వాతావరణం సమయంలో పెను సవాల్. ఈ క్రమంలోనే.. ఐపీఎల్ మ్యాచులు అన్నింటినీ రద్దు చేసింది బీసీసీఐ.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    అర్నబ్ తుపాన్ బీభత్సం – రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు

    అక్షర ఉదయమ్, అమరావతి :  అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ...

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...